News September 12, 2024

కడప: వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి

image

వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతోపాటు మన ప్రాణాలకు ముప్పు రాకుండా విధి నిర్వహణను బాధ్యతను నిర్వర్తించాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. జాతీయ అటవీశాఖ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కడపలో కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

Similar News

News September 29, 2024

రాజంపేట: బంగారు నగలు చోరీ

image

రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవ రాయలు నగర్‌లో నివాసం ఉండే రవి ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి 70 గ్రాములు బంగారు నగలు చోరీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను సీఐ ఎల్లమ రాజు, ఎస్సై ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అయితే జిల్లాలో వారం రోజుల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

News September 29, 2024

ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా

image

కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్​కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.

News September 29, 2024

చక్రాయపేటలో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం

image

కడప జిల్లా చక్రాయపేట మండలంలో నెరుసుపల్లె గ్రామం అప్పిరెడ్డిగారిపల్లెలో శివాజీ అనే యువకుడు, శనివారం ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను కడప రిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడు శివాజీని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.