News March 17, 2025

కడప: సమస్యలుంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

image

కడప జిల్లా పరిధిలోని ప్రజలు వారి సమస్యలను ఫోను ద్వారా తెలియజేసేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల వరకు ఫోన్ ద్వారా సమస్యలు తెలియజేయవచ్చని వివరించారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.

Similar News

News March 18, 2025

పెండ్లిమర్రి: నేడు నరసింహస్వామికి విశేష పూజలు

image

కడప జిల్లా పెండ్లిమర్రి మండలం వేయి నూతుల కోనలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నేడు స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో తెల్లవారుజామునే స్వామి వారికి పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం భక్తులకు దర్శన ఏర్పాట్లు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

News March 17, 2025

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

image

ఏప్రిల్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒంటిమిట్ట ఆలయం, 4 మాడవీధులు, కళ్యాణ వేదిక, పార్కింగ్ ఇతర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రత చర్యలపై సమీక్షించారు.

News March 16, 2025

WPL ఫైనల్: రెండు వికెట్లు తీసిన కడప జిల్లా అమ్మాయి

image

ఉమెన్ ప్రీమియర్ లీగ్(WPL) ఫైనల్ శనివారం జరిగింది. ఈ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్, డిల్లీ క్యాపిటల్స్ తలపడగా ముంబై గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో మన కడప జిల్లా ఎర్రగుంట్లలోని ఆర్డీపీపీకి చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి డిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడింది. ముందుగా బౌలింగ్‌ చేసి 4 ఓవర్లకు 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 4 బంతులకు 3 పరుగులు చేసింది.

error: Content is protected !!