News January 21, 2025
కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష

వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News December 6, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=
News December 6, 2025
కడప: ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలపై GST దాడులు.!

కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్, ట్రావెల్ కార్యాలయాలపై శుక్రవారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. CTO జ్ఞానానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో, CTO రాజనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కడపలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. పెనాల్టీ విధించారు. ప్రొద్దుటూరులో 4 ట్రాన్స్పోర్ట్, 3 ట్రావెల్ కార్యాలయాలపై దాడులు జరిగాయి.
News December 6, 2025
ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్

ఒంటిమిట్ట ఆలయానికి 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ని రూపొందించాలని TTD EO అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు. TTD పరిపాలన భవనంలో ఆయన ఒంటిమిట్ట అధికారులతో శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, అందులో మ్యూజియం, ఉద్యానవనాలు, చెరువులో జాంబవంతుని 108 అడుగుల విగ్రహం వంటి అనేక అభివృద్ధి పనులపై చర్చించారు.


