News February 13, 2025
కడప: హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన

బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ ధారణపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు.
Similar News
News September 19, 2025
22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.
News September 19, 2025
కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.
News September 19, 2025
వరి పంట నారుమడులను పరిశీలించిన కలెక్టర్

దువ్వూరు మండలంలో సాగు చేసిన వరి పంట నారుమడులను గురువారం కలెక్టర్ శ్రీధర్ పొలాలకు వెళ్లి నేరుగా పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల సాగు పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటుపై రైతులతో చర్చించారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. డిమాండ్, మార్కెట్ ఉన్న వాటిని సాగు చేయాలని సూచించారు.