News October 8, 2024

కడప – హైదరాబాదుకు రోజువారీ సర్వీసులు

image

కడప- హైదరాబాదుకు విమానయాన ఇండిగో సంస్థ రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈనెల 27న హైదరాబాదులో ఉదయం11.30 గంటలకు బయలుదేరి, మ.12.40కి కడపకు చేరుతుంది. మళ్లీ కడపలో సా. 3.55 కి తిరుగుపయనమై సా.5.10కి హైదరాబాదు చేరుతుంది. www.goindigo.in వెబ్ సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలి సంస్థ తెలిపింది.

Similar News

News December 3, 2025

కడప: రైలులో లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

image

రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో బుధవారం కడప పోక్సో కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డీఆర్ఎంను ఆదేశించారు. విధుల్లో ఉన్న టీటీఐలపై చర్యలకు సిఫార్సు చేశారు. శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజును, పీపీలను ప్రశంసించారు.

News December 3, 2025

శనగ పంటలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి: JDA

image

శనగ పంటలో పచ్చ పురుగు నివారణకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(JDA) చంద్ర నాయక్ రైతులకు సూచించారు. ప్రొద్దుటూరు మండలంలో సాగుచేసిన పప్పు శనగ పంటను బుధవారం ఆయన పరిశీలించారు. పచ్చ పురుగులను పక్షులు ఏరుకొని తింటాయన్నారు. ఖర్చు తగ్గుతుందన్నారు. వేప నూనె, ట్రైకోడెర్మా విరిడి పిచికారీ చేయాలన్నారు. ఆయన వెంట ADA అనిత, MAO వరహరికుమార్, టెక్నికల్ AO సుస్మిత పాల్గొన్నారు.

News December 3, 2025

కడప రిమ్స్ సేవలపై మీ అభిప్రాయమేంటి?

image

కడప రిమ్స్‌లో అందే సేవల విషయంలో పేషెంట్లు, వారి వెంట వెళ్లే కుటుంబసభ్యులు నిరుత్సాహం చెందుతున్నట్లు సమాచారం. ఇటీవల స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కుటుంబీకులు చేతుల మీద ఎత్తుకెళ్లారు. అలాగే పేషెంట్లను తీసుకెళ్లాల్సిన స్ట్రెచర్లను చెత్తను తరలించడానికి సిబ్బంది ఉపయోగించిన ఫొటోలు కూడా బయటికి రావడంతో విమర్శలు వస్తున్నాయి. అక్కడి సేవలు, మీరు ఎదుర్కొన్న సమస్యలను కామెంట్ చేయండి.