News August 17, 2024
కడప: హౌసింగ్ నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయండి

హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహ నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కాంట్రాక్టర్లతో గృహ నిర్మాణాలపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్క గృహాల నిర్మాణంలో నిర్దేశిత లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 16, 2025
ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగి సస్పెన్షన్.!

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓబులేసును సస్పెండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ సీసీగా, అజెండా క్లర్క్‌గా ఓబులేసు విధులు నిర్వహిస్తున్నాడు. పెట్రోల్ బంకులో జరిగిన అక్రమాలపై అక్కడి మేనేజర్ ప్రవీణ్‌పై కమిషనర్ చర్యలకు ఉపక్రమించారు. ఆ మేరకు ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపారు.
News December 16, 2025
కడప జిల్లాలో దుమారం రేపిన CIల బదిలీలు.!

కడప జిల్లాలో CIల బదిలీలపై కూటమి ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమను సంప్రదించకుండా సీఐల బదిలీలు చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే ప్రొద్దుటూరు, ముద్దనూరు, కమలాపురానికి కొత్త సీఐలను నియమించారని దీనిపై ప్రొద్దుటూరు MLA వరద మండిపడుతున్నారు. CMOకు ఫిర్యాదు చేయడానికి ఆయన అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది.
News December 16, 2025
కడప జిల్లాలో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

కడప జిల్లాలో విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు హెటిరో సంస్థకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాలోని కొండాపురం మండలం టి.కోడూరులో 30 ఎకరాలు, చామలూరు గ్రామంలో 10 ఎకరాలు, కొప్పోలులో 5 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరాకు ఏడాదికి రూ.3 లక్షలు లీజు ప్రాతిపాదికన భూములు కేటాయించారు.


