News August 9, 2024

కడప: 12 నుంచి వైవీయూ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు

image

వైవీయూ డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్షలు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయని వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ. ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. పరీక్షలన్నీ వైవీయూ క్యాంపస్‌లో మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలల నుంచి హాల్‌టికెట్లు తీసుకోవాలన్నారు. పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందే క్యాంపస్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్‌ లైబ్రరీ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Similar News

News February 27, 2026

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: జేసీ

image

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని శుక్రవారం DIEPC సమావేశంలో జేసీ నిధి మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 18 శాఖలకు సంబంధించి 11,033 దరఖాస్తులు వచ్చాయని, 10,886 దరఖాస్తులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. 10,836 పరిశీలనలో, 50 పరిశీలనకు సిద్ధంగా ఉన్నాయన్నారు. 88 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు. 59 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచడం జరిగిందన్నారు.

News February 27, 2026

బి.మఠం: మృతులు బద్వేలు వాసులుగా గుర్తింపు

image

బ్రహ్మంగారిమఠం మండలం నంది పల్లె పాల డైరీ వద్ద లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు <<19255263>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. మృతులు భార్యభర్తలు కావ్య, ప్రసాద్‌గా స్థానికులు గుర్తించారు.బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్తమ్మ నగర్‌లో నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. వీరి తల్లిదండ్రులు బద్వేల్ మున్సిపాలిటీ కుమ్మరి కొట్టాలలో ఉన్నారని తెలుస్తోంది.

News February 27, 2026

బ్రహ్మంగారిమఠంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దొడ్ల డైరీ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పైకి లారీ దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ లారీ కిందకి వెళ్లడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే మంటలను అదుపు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.