News January 13, 2025

కడప: 15న జరగాల్సిన UGC – NET పరీక్ష వాయిదా

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జనవరి 15న జరగాల్సిన UGC-NET డిసెంబర్ 2024 పరీక్షను సంక్రాంతి, పొంగల్ పండుగ సందర్భంగా వాయిదా వేశారు. 16 నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం వెబ్‌సైట్ www.nta.ac.in ను సందర్శించాలని ఎన్టీఏ (ఎగ్జామ్స్) డైరెక్టర్ రాజేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కొత్త పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

Similar News

News December 24, 2025

మాజీ సీఎం జగన్‌ను కలిసిన జిల్లా ముఖ్య నాయకులు

image

మూడు రోజుల కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. పులివెందులలోని ఆయన నివాసంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలలో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ నాయకులకు సూచించారు.

News December 24, 2025

కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ ఫొటో

image

క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఫొటోను ఆయన అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫొటోలో విజయమ్మ, దివ్యారెడ్డి, భారతి రెడ్డి తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.

News December 24, 2025

భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా “స్మార్ట్ కిచెన్” నిర్మించాలి: కలెక్టర్ శ్రీధర్

image

విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్ నిర్మాణం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. మంగళవారం చెన్నూరు మండలం కొండపేటలో రూ.38 లక్షలతో నిర్మిస్తున్న డొక్కా సీతమ్మ స్మార్ట్ కిచెన్‌ను పరిశీలించారు. ఈ కేంద్రం నుంచి 41 పాఠశాలలకు భోజనం సరఫరా అవుతుందని ఆయన తెలిపారు.