News January 3, 2025
కడప: 150 స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్

కడప జిల్లా జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ రామగిడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడప పాత రిమ్స్‌లోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్‌సైటును సంప్రదించాలన్నారు.
Similar News
News January 7, 2026
కడప జిల్లాలో 18 మంది SIల బదిలీలు

కడప జిల్లాలో ఎస్సైలను భారీగా బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 18 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలంటూ ఆయన ఆదేశించారు. ప్రొద్దుటూరు, కడప, బద్వేలు, మైదుకూరు ప్రాంతాల్లో దాదాపు SIలకు స్థాన చలనం కల్పించారు.
News January 7, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.14,110
* బంగారు 22 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.12,981
* వెండి 10 గ్రాములు ధర రూ.2,520.
News January 7, 2026
BREAKING: ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు క్వాలిఫై అయిన ఏపీ టీమ్

69వ జాతీయ U-14 బాలికల వాలీబాల్ టోర్నమెంట్లో ఏపీ టీమ్ సత్తా చాటుతోంది. ఇవాళ గోవాపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. జమ్మలమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వరుసగా మూడు సెట్లలో ఆధిపత్యం కనబరిచి మరో 2 సెట్లు ఉండగానే విజయం సాధించింది. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు. రేపు జరిగే ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది.


