News September 18, 2024

కడప: 19 నుంచి AP ఆన్లైన్ శాండ్ పోర్టల్ ప్రారంభం

image

ఈనెల 19 నుంచి ఏపీ ఆన్‌లైన్ శాండ్ పోర్టల్ అందరికీ అందుబాటులోకి రానుందని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభిస్తారని తెలిపారు. ఇసుక బుకింగ్ ప్రక్రియ, రవాణాదారుల జాబితా పొందుపరిచే ప్రక్రియ, బల్క్ వినియోగదారుల ఇసుక అవసరాన్ని ముందుగానే వెరిఫికేషన్‌ను భూగర్భ శాఖ ద్వారా జేసీ లాగింగ్‌కు పంపించాలని తెలిపారు.

Similar News

News December 21, 2025

కడప: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

image

కడప జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. కడపలోని 47వ డివిజన్‌లోని కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?

News December 21, 2025

వ్యవసాయ రంగంతో కడప జిల్లాకు భారీ ఆదాయం.!

image

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 40.27 లక్షల క్వింటాల్ల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరిగింది. ప్రభుత్వానికి మార్కెట్ సెస్ రూపంలో రూ.7.09 కోట్లు రాబడి లభించింది. (రూ.లక్షల్లో) వరి-115.46, బియ్యం-25.12, వేరు శనగ-30.94, ప్రత్తి-94.77, ఉల్లి-13.29, పప్పు శనగ-16.91, కంది-1.19, బత్తాయి-13.73, పసుపు-92.90, మినుము-30.84, నువ్వులు-54.27, మొక్కజొన్న-62.86, ఇతర వాటినుంచి-157 రాబడి వచ్చింది.

News December 21, 2025

కడప జిల్లాలో పడిపోయిన రబీ సాగు.!

image

రబీలో గత ఏడాది జిల్లాలో లక్ష హెక్టార్లలో పంటలు సాగవ్వగా, ఈ ఏడాది 77,121 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు. (గత-ప్రస్తుత ఏడాది పంటల సాగు హెక్టార్లలో) వరి, గోధుమ, జొన్న, రాగి, కొర్ర తదితర పంటలు 5,145-3,859, శనగ, కంది, మినుము, పెసర, అలసంద పప్పు ధాన్యాలు 89,882-69,933, వేరుశనగ, సన్ ఫ్లవర్, నువ్వులు నూనె గింజలు 4,524-2,516, పత్తి, చెరకు వాణిజ్య పంటలు 141-57 హెక్టార్లలో రైతులు సాగు చేశారు.