News August 9, 2024
కడప: 1999 స్కూళ్లలో ఎస్ఎంసీ ఎన్నికలు.. 52చోట్ల వాయిదా

జిల్లా వ్యాప్తంగా గురువారం 2051 స్కూళ్లలో ఎస్ఎంసి ఎన్నికలు జరగాల్సి ఉండగా 1999 స్కూళ్లలో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1602 ప్రాథమిక, 115 ప్రాథమికోన్నత, 282 ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 1357 పాఠశాలల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కాగా వివిధ కారణాలతో 52 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అధికారులు ఎన్నికలను పర్యవేక్షించారు.
Similar News
News November 23, 2025
కడప జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి.!

ముద్దునూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు శనివారం కత్తితో దాడి చేసినట్లు స్థానిక SI తెలిపారు. ముద్దనూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ పనుల విషయంలో ఈ దాడి జరిగిన ఎస్సై వివరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 23, 2025
పొద్దుటూరు పోలీసుల చర్యతో ప్రజల్లో ఆందోళన..!

కొద్ది రోజులక్రితం ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాలరెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే శుక్రవారం రాత్రి పొద్దుటూరులో మరో బంగారు వ్యాపారి శ్రీనివాసులును కూడా కిడ్నాప్ చేశారు. ఈ మేరకు ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు 24 గంటలు కుటుంబ సభ్యులకు, మీడియాకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపనలు ఉన్నాయి. శ్రీనివాసులును రక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు.
News November 22, 2025
కడప: ‘27 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు’

YVU పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణారావు తెలిపారు. MA, Mcom, Msc, ఎం.పి.ఎడ్ మూడో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27, 29, డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయన్నారు.


