News May 4, 2024
కడప: 2004 తర్వాత ఆ నియోజకవర్గం మాయం
కడప జిల్లాల్లో 1955లో శాసనసభకు ఎన్నికలు జరగడం మొదలయ్యాయి. అప్పట్లో మన జిల్లాలో మొత్తం 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అలా 2004 వరకు కొనసాగాయి. జిల్లాల పునర్విభజన కారణంగా 2004లో ఒక నియోజకవర్గంగా ఉన్న లక్కిరెడ్డిపల్లెను తప్పించారు. ఇందులో ఉన్న మండలాలను రాజంపేట, రాయచోటిలోకి కలపడంతో ఆ నియోజకవర్గం కనుమరుగైంది. ఈ లక్కిరెడ్డిపల్లె మొదటి ఎమ్మెల్యే కడప కోటిరెడ్డి. చివరి ఎమ్మెల్యే జి.మోహన్ రెడ్డి(కాంగ్రెస్).
Similar News
News November 2, 2024
కడప జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి.. ఎప్పుడంటే.!
కడప జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత ఈనెల 5న జిల్లాకు రానున్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో మొదటిసారి ఆమె జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం కడప కలెక్టరేట్‌లో జరిగే జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశానికి మంత్రి హాజరుకానున్నారు. జిల్లాకు రానున్న మంత్రి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో భేటీ కానున్నారు. అనంతరం జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.
News November 1, 2024
కడప: 4 నుంచి బీఈడీ సెమిస్టర్ పరీక్షలు
వైవీయూ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో 2, 4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలను జిల్లాలోని కేంద్రాలను నిర్వహిస్తున్నామని 16,900 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలని సూచించారు.
News November 1, 2024
పుల్లంపేట: మహిళ చీరకు అంటుకున్న మంట
కొవ్వొత్తి పొరపాటున చీరకు అంటుకొని మహిళ గాయాలపాలైన ఘటన పుల్లంపేట మండలంలోని రామాపురంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఓ మహిళ ఇంట్లో దీపాలు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చీరకు మంట అంటుకొని గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు.