News July 16, 2024
కడప: 22న డిగ్రీ విద్యార్థులకు వైవా-వోస్ పరీక్ష

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు వైవా- వోస్ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ ఫీజు చెల్లించిన విద్యార్థులు వైవావోస్కు కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు ప్రాజెక్ట్ రికార్డు హార్డ్ కాపీని సమర్పించాలన్నారు.
Similar News
News December 4, 2025
కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.
News December 4, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00
News December 4, 2025
కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.


