News July 25, 2024
కడప: 27 లోపు వివరాలను నమోదు చేయాలి

వైవీయూలోని అనుబంధ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్ అందరికీ, డిగ్రీ 2023-24 సంవత్సరాలకు సంబంధించిన II, IV సెమిస్టర్ల EDX కోర్సు వివరాలను 27వ తేదీలోపు నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. హార్డ్ కాపీని పరీక్షా శాఖ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఇప్పటికే YVUకు హార్డ్ కాపీలు పంపిన వారు మళ్లీ పంపవద్దని సూచించారు.
Similar News
News November 27, 2025
ఒంటిమిట్ట మండలంలో కుంగిన వంతెన

ఒంటిమిట్ట మండల పరిధిలోని చెర్లోపల్లి గ్రామానికి వెళ్లేందుకు వంకపై వేసిన వంతెన కుంగిపోయింది. ఈ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఒంటిమిట్ట మండలంలో వంకలు పొంగి పొర్లాయి. చెర్లోపల్లి వంకలో అధిక నీటి ప్రవాహం ప్రవహించడంతో వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి నాని పోయింది. ఈ క్రమంలో ఆ వంతనపై అధిక బరువు ఉన్న ఇసుక టిప్పర్ వెళ్లడంతో ఆ బరువుకు వంతెన కుంగినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
News November 27, 2025
కరెంట్ షాక్తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 27, 2025
పులివెందులలో జగన్.. విద్యార్థులతో సెల్ఫీ

కడప జిల్లా పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇవాళ తన సొంత నియోజకవర్గంలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. జగన్ దారి మధ్యలో వెళ్తూ ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ వెళ్లారు. అందులో ఆయనను కలవడానికి స్థానికంగా పిల్లలు వచ్చారు. వారితో ఆయన ఆప్యాయంగా మాట్లాడుతూ.. సెల్పీ తీసుకున్నారు. బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.


