News August 11, 2024
కడప: 28 మంది MPDOలకు పోస్టింగ్
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈసీఐ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీడీఓలు తిరిగి సొంత జిల్లాకు చేరుకున్నారు. ఇంతకుముందు పనిచేసిన మండలాల్లోనే వీరికి తిరిగి పోస్టింగ్ ఇస్తూ జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 మంది ఎంపీడీవోలు బదిలీపై రానున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 10, 2024
కడప: వివిధ మండలల్లో నమోదైన వర్షపాతం
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. కమలపురం, మైదుకూరులలో అత్యధికంగా 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోపవరంలో 7.8, వేములలో 7, బద్వేల్ 6.8, పొద్దుటూరు, జమ్మలమడుగు, మీ.మీలో 6.2, ఖాజీపేట, చాపాడులలో 6, కడపలో 5.4, చక్రాయపేటలో 5, దువ్వూరులో 4.8, బి.మఠంలో 3.6, బి.కోడూరులో 3.4, వల్లూరులో 3.2, సిద్దవటం3, ఆట్లూరు 2, సీకేదిన్నె1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది
News September 10, 2024
కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్
కడప రూరల్ సబ్ రిజిస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుందరేశన్‌ను ఉన్నతాధికారులు సస్పండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సీనియర్ అసిస్టెంట్‌గా పంపారు. ఇటీవల కడపకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ జరిగిన కొన్ని రిజిస్ట్రేషన్లపై తీవ్ర స్థాయిలో ఆరరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో తప్పిదాలకు కారణమైనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
News September 10, 2024
కడప: డయల్ యువర్ కలెక్టర్‌కు విశేష స్పందన
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన, సత్వర పరిష్కారం లభించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివశంకర్ లోతేటి నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం ఏడుగురు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కడప ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ వెంకటపతి ఆదేశించారు.