News June 12, 2024

కడప: 6 సార్లు ఎమ్మెల్యే అయినా దక్కని మంత్రి పదవి

image

ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజులరెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి లభించలేదు. ఈయన 1985లో TDP తరఫున గెలిచిన ఆయన తర్వాత కాంగ్రెస్‌లో చేరి 1989లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వరుసగా మూడు సార్లు MLAగా విజయం సాధించారు. తిరిగి ఈ ఎన్నికల్లో 22,744 మెజార్టీ ఓట్లతో గెలిచారు. ఈయనకు మంత్రి పదవి ఖాయమని ఆయన వర్గీయులు ఆశించారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించకపోవడంతో నిరాశ చెందారు.

Similar News

News November 16, 2025

కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

image

కడప రైల్వే స్టేషన్‌లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

News November 16, 2025

కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు.!

image

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల CI శ్రీనివాసులను రైల్వే కోడూరుకు, రైల్వే కోడూరు CI హేమసుందర్ రావును పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఒంటిమిట్ట CI బాబును అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు‌ VRలో ఉన్న నరసింహరాజు ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ CI జావేద్ కడప జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేశ్ రెడ్డి రానున్నారు.

News November 16, 2025

రేపు కడప కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

image

కడప నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. ఉదయం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్, జాయింట్ అధితి సింగ్‌తో సహా జిల్లాలోని ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అర్జీ దారులు తమ సమస్యలను ఉన్నతాధికారాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేశారు.