News August 6, 2024
కడప: 800 మంది వద్ద రూ.10 కోట్లు వసూలు

ప్రొద్దుటూరు, కడప ఆదాయపు పన్ను శాఖ పరిధిలో రూ.7 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఉద్యోగులు పన్ను చెల్లించాలి. కొందరు ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారికొచ్చే వేతనం నుంచి గృహ నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేశారని గుర్తించి, ప్రొద్దుటూరు ఆదాయపు పన్ను డివిజన్ పరిధిలో గతేడాది 800 మందికి నోటీసులు ఇచ్చి వారినుంచి రూ.10 కోట్లకు పైగా నగదు వసూలు చేశారు.
Similar News
News September 16, 2025
కడప: మెగా DSC.. 32 పోస్టులు ఖాళీ

మెగా DSCకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి కడప జిల్లాలో 712 పోస్టులకు గాను 680 పోస్టులు భర్తీ అయినట్లు విద్యాశాఖ తెలిపింది. వివిధ కారణాల చేత మిగిలిన పోయిన 32 పోస్టులను వచ్చే DSCలో చేర్చనున్నారు. ఈ నెల 19న ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.
News September 16, 2025
మైదుకూరు: ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

మైదుకూరు పట్టణం సాయినాథపురం గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. రమేశ్ తన ఇంటి అవసరాల కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణం తీసుకున్నాడు. రుణాలు చెల్లించకపోవడంతో కంపెనీ సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యనికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.