News August 6, 2024
కడప: 800 మంది వద్ద రూ.10 కోట్లు వసూలు
ప్రొద్దుటూరు, కడప ఆదాయపు పన్ను శాఖ పరిధిలో రూ.7 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ఉద్యోగులు పన్ను చెల్లించాలి. కొందరు ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారికొచ్చే వేతనం నుంచి గృహ నిర్మాణాలకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేశారని గుర్తించి, ప్రొద్దుటూరు ఆదాయపు పన్ను డివిజన్ పరిధిలో గతేడాది 800 మందికి నోటీసులు ఇచ్చి వారినుంచి రూ.10 కోట్లకు పైగా నగదు వసూలు చేశారు.
Similar News
News September 11, 2024
కడప: ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన స్టాఫ్ నర్సుపై కేసు
కడప నగరంలోని కలెక్టరేట్ ముందు సోమవారం గ్రీవెన్స్ సమయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన స్టాఫ్ నర్స్ బి.చిన్నమ్మపై మంగళవారం కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నమ్మ తనను డాక్టర్ చెన్నకృష్ణ ప్రేమ పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే బలవన్మరణానికి ప్రయత్నం చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News September 11, 2024
పులివెందుల ఒంటి కన్నుతో మేక పిల్ల జననం
సింహాద్రిపురం ఒంటి కన్నుతో మేక పిల్ల పుట్టడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకిస్తున్నారు. మంగళవారం మండలంలోని గురజాల గ్రామానికి చెందిన కొమ్మెర శ్రీనివాసులుకు సంబంధించిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక పిల్లకు నుదుటన ఒకే కన్ను ఉంది. మరో పిల్ల రెండు కళ్లతో సాధారణంగా జన్మించింది. రెండు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. జన్యుపరమైన లోపంతో ఒక కన్నుతో పుట్టిందని తెలిపారు.
News September 11, 2024
రాష్ట్రస్థాయి పోటీలకు వల్లూరు విద్యార్థినులు
వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ కం జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా పులివెందులలో మంగళవారం నిర్వహించిన బాలికల విభాగం ఖోఖో పోటీల్లో కళాశాలకు చెందిన ఇంటర్ సెకండీయర్ ఎంపీసీ విద్యార్థిని మమత, ఇంటర్ సెకండీయర్ బైపీసీ విద్యార్థిని ముబీన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.