News March 27, 2025
కడప: 98 ఏళ్ల వయసులోనూ ఓటేసిన జడ్పీటీసీ

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ఓ స్ఫూర్తిదాయక దృశ్యం కనిపించింది. గురువారం కడప నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఛైర్మన్ ఎన్నికలో ఉమ్మడి కడప జిల్లా గాలివీడు జడ్పీటీసీ షేక్ భానూ బీ 98ఏళ్ల వయసులోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలో ప్రతి ఓటు కీలకం అయిన నేపథ్యంలో ఆమె ఓటు వేసి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
Similar News
News December 7, 2025
ప్రకాశం ప్రజలకు కలెక్టర్ కీలక సూచన.!

ఒంగోలులోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజాబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను ప్రజలు వినియోగించుకోవాలని, అర్జీల స్థితిగతులను అర్జీదారులు కాల్ సెంటర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కానివారు వాటి స్లిప్పులను తీసుకురావాలన్నారు.
News December 7, 2025
‘రాజాసాబ్’కు ఆర్థిక సమస్యలా?.. నిర్మాత క్లారిటీ!

ఫైనాన్స్, లీగల్ ఇష్యూలతో అఖండ-2 సినిమా <<18489140>>రిలీజ్<<>> వాయిదా పడటం తెలిసిందే. ఈ క్రమంలో రాజాసాబ్ గురించీ ఊహాగానాలు రావడంతో నిర్మాత TG విశ్వ ప్రసాద్ స్పందించారు. ‘సినిమా విడుదలకు అంతరాయం కలిగించే ప్రయత్నం దురదృష్టకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. రాజాసాబ్ కోసం సేకరించిన పెట్టుబడులను క్లియర్ చేశాం. మిగిలిన వడ్డీని త్వరలోనే చెల్లిస్తాం’ అని ట్వీట్ చేశారు. అఖండ-2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
News December 7, 2025
స్పీకర్కు హరీశ్ రావు బహిరంగ లేఖ

శాసన సభ నిబంధనలను పాటించకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖలో విమర్శించారు. రెండేళ్లయినా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని నిర్లక్ష్యం చేయడం, ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని హరీశ్ పేర్కొన్నారు.


