News September 11, 2024
కడప: LLB తొలి సెమిస్టర్ ఫలితాలు విడుదల
యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న ఐదేళ్ల LLB మొదటి సెమిస్టర్, మూడేళ్ల LLB మొదటి సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి, కుల సచివులు ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలసి విడుదల చేశారు. తక్కువ కాలంలోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన పరీక్షల విభాగాన్ని వీసీ అభినందించారు.
Similar News
News October 6, 2024
దువ్వూరు: శవమై తేలిన తప్పిపోయిన రెండేళ్ల బాలుడు
దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 6, 2024
కడప నగరంలో కారు బోల్తా
బిజీగా ఉండే కడప నగరంలోని అప్సర సర్కిల్ వద్ద కారు బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేగంగా వచ్చిన ఓ కారు అప్సర సర్కిల్ వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చిన్న చౌక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫల్టీ కొట్టిన కారును పరిశీలిస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయనే విషయాలు తెలియాల్సిఉంది.
News October 6, 2024
YVU: సెలవులున్నా.. పరీక్షలు యథాతథం
కడప యోగి వేమన విశ్వవిద్యాలయానికి నేటి నుంచి ఈనెల 13 వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 14వ తేదీన తరగతులు తిరిగి మొదలవుతాయి. BL, LLB సెమిస్టర్ పరీక్షలు ముందుగా సూచించినట్లు ఈనెల 8, 10వ తేదీల్లో యథావిధిగా కొనసాగనున్నాయి. ఏపీఐసెట్ స్పాట్ అడ్మిషన్లు వైవీయూలో 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.