News January 21, 2025

కడప SPగా నార్పల గ్రామ వాసి

image

కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పల గ్రామం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ 2010లో డీఎస్పీగా విధుల్లో చేరారు. నాగర్ కర్నూల్, చింతలపల్లె, కడపలో డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2018లో ఏఎస్పీగా ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమోషన్‌పై ఇటీవల ఎస్పీగా పదోన్నతి రావడంతో మొదటి పోస్టింగ్ కడపకు ఇచ్చారు.

Similar News

News February 16, 2025

చెత్త విషయంలో తల్లి, కొడుకుపై కత్తితో దాడి

image

గుత్తి ఆర్ఎస్‌లో చెత్త పడేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఇంటిముందు చెత్త పడేశారని వంశీ, అతని తల్లి సాయమ్మపై రిజ్వానా, రసూల్ కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వంశీ, సాయమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News February 16, 2025

విద్యార్ధి ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలి: JNTU ఇన్‌ఛార్జ్ వీసీ

image

అనంతపురంలోని JNTU-OTPRIలో శనివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శన రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

News February 16, 2025

అనంత: సేవాగడ్‌లో డోలు, కత్తి పట్టిన కలెక్టర్

image

గుత్తి మండలం చెర్లోపల్లి సేవాఘడ్‌లోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్‌ను శనివారం అనంత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఆలయ కమిటీ సభ్యులు డోలు, కత్తిని అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను లోకల్ ఫెస్టివల్‌గా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

error: Content is protected !!