News March 30, 2024
కడప TDP నేతలపై కేసు నమోదు

కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద TDP ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడంపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించకుండా, అనుమతి లేకుండా TDP నేతలు కేక్ కట్ చేశారని సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా TDP జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులరెడ్డి, కడప అసెంబ్లీ TDP అభ్యర్థి మాధవరెడ్డి, హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డితోపాటు పలువురు ఉన్నారు.
Similar News
News December 4, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00
News December 4, 2025
కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.
News December 4, 2025
నేడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం

ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో గురువారం సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం చేయించాలనుకునేవారు ఒక్కో టికెట్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.


