News April 3, 2024
కడప: YSR 5 వేలు.. YS జగన్ 5 లక్షలతో గెలుపు

కడప MP ఎన్నికల్లో అరుదైన రికార్డు ఉంది. అక్కడ రాజ శేఖర్ రెడ్డి 4 సార్లు పోటీ చేయగా.. YS జగన్ 2 సార్లు పోటీ చేశారు. YSR 1996లో మొదటిసారి MPగా పోటీ చేసినప్పుడు TDP అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై 5445 ఓట్లతో గెలిచారు. అలాగే జగన్ 2011 ఉప ఎన్నికల్లో 5,45,671 ఓట్ల తేడాతో డి.ఎల్ రవీంద్రారెడ్డిపై గెలిచారు. ఇప్పటి వరకు జరిగిన కడప ఎంపీ ఎన్నికల్లో YSRకు అత్యల్ప ఓట్లు రాగా.. జగన్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయి.
Similar News
News July 11, 2025
ప్రొద్దుటూరు: రూ.కోట్లతో రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణం.. అటవీ శాఖ అభ్యంతరం

రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి అటవీశాఖ నుంచి బ్రేక్ పడింది. అప్రోచ్ రోడ్లు RFలోకి వస్తున్నాయంటూ అభ్యంతరం తెలిపింది. స్థానిక రామేశ్వరం పెన్నా నదిపై రూ.53కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. MDR గ్రాంట్ స్కీమ్ నిధులతో ప్రొద్దుటూరు- RTPP మార్గంలో R&B బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సుమారు 65% పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్రోచ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పనికి బ్రేక్ పడింది.
News July 11, 2025
కడప: ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు

కడప జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ అశోక్ కుమార్ సిబ్బందికి సూచించారు. ఆధ్యాధునిక సాంకేతికతతో రూపొందించిన బైకులను ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసే సదుపాయాలు ఈ వాహనాల్లో ఉన్నాయి. కడపకు 7, ప్రొద్దుటూరుకు 4, పులివెందులకు 2, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలుకు ఒకొక్కటి చొప్పున నూతన వాహనాలు కేటాయించారు.
News July 11, 2025
ప్రొద్దుటూరు: 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు

ప్రొద్దుటూరులోని రామేశ్వరం పురపాలక ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి. నెల కిందట ఇక్కడ HM, ఆరుగురు టీచర్లు ఉండేవారు. బదిలీల తర్వాత ఇక్కడ ఇప్పుడు HM ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్ల కొరతపై MEO దృష్టికి తీసుకెళ్లామని HM వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. టీచర్ల సర్దుబాటు తన పరిధిలో లేదని MEO సావిత్రమ్మ తెలిపారు.