News May 25, 2024
కడప: YVUకి బంగారు పతకం

యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని బద్వేల్ నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు చెందిన మురళీ కృష్ణ ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీవరకు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి వైవీయూకు బంగారు పతకం అందించారు. శనివారం ఉదయం మురళి కృష్ణను యూనివర్సిటీకి పిలిపించి వీసీ చింత సుధాకర్, అధ్యాపకులు సత్కరించారు.
Similar News
News November 13, 2025
ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా..!

ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. వాళ్ల దెబ్బకు అధికారులు సైతం హడలి పోతున్నారు. ఇటీవల రేషన్ బియ్యం తరలిస్తుండగా 1టౌన్, 3టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు మండలంలో 143 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 68,675 రేషన్ కార్డులున్నాయి. నవంబర్ నెలకు 9,839 క్వింటాళ్ల బియ్యం, 648 క్వింటాళ్ల చక్కెర, 1,427 క్వింటాళ్ల జొన్నలు వచ్చాయి. వీటిలో ఎక్కువ భాగం పక్కదారి పట్టాయని సమాచారం.
News November 13, 2025
19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.


