News July 3, 2024
కడప: YVUలో డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రారంభం
వైవీయూలో 2024-25 విద్యా సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎస్.రఘునాథరెడ్డి వెల్లడించారు. ప్రొ. కృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం-2020ని అనుసరించి కోర్సులను తెచ్చామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకోవచ్చన్నారు.
Similar News
News October 7, 2024
అన్నమయ్య: పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి
పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సంబేపల్లి మండలం సోమవరం గ్రామం బావులకాడపల్లి జగనన్న కాలనీ సమీపంలోని వ్యవసాయ పొలంలో, పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 7, 2024
కడప – చెన్నై జాతీయ రహదారిపై తప్పిన ఘోర ప్రమాదం
పుల్లంపేట మండలం జాగువారి పల్లి వద్ద కడప – చెన్నై జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు – లారీ ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న సింహాద్రిపురం, చింతకొమ్మదిన్నె ఎస్సైల భార్యలకు స్వల్ప గాయాలయ్యాయి. మరో లారీ డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో సుమారు 600 లీటర్లు డీజిల్ రోడ్డుపై పడింది. పొరపాటున మంటలు చెలరేగి ఉంటే ఘోర ప్రమాదమే జరిగి ఉండేది. ఘటన స్థలానికి పుల్లంపేట పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు.
News October 6, 2024
దువ్వూరు: శవమై తేలిన తప్పిపోయిన రెండేళ్ల బాలుడు
దువ్వూరుకు చెందిన తంగేడు పల్లె సాయికుమార్ కుమారుడు అమర్(2) ఈనెల 3న ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు. ఆ సమయంలో బాలుడి ఆచూకి కోసం తల్లిదండ్రులు దువ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు కేసి కాలువలో శవమై తేలాడు. బాలుడు మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.