News November 21, 2024

కడలే ఆధారం.. తీరమే ఆవాసం (ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం)

image

కడలి అలల పైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే.. ఇంతచేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం, బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం ఉండదు.. మరి గడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని రోజుల తరబడి ప్రయాణం.. అయినా భగవంతుడిపై భారం వేసి, సముద్రంపై నమ్మకం ఉంచి, బతుకుపోరు సాగిస్తారు మత్స్యకారులు.

Similar News

News December 8, 2024

మనుబోలు హైవేపై లారీ బోల్తా

image

మనుబోలు మండలంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వెళుతున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.

News December 8, 2024

రోడ్డు ప్రమాదంలో నలుగురు సిరిపురం వాసులు స్పాడ్ డెడ్

image

పల్నాడు జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో చనిపోయింది కావలి మండలం సిరిపురం వాసులుగా సమాచారం. వారు కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తుళ్లూరి సురేష్, వనిత, యోగిలు, వెంకటేశ్లర్లుగా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 7, 2024

పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట డీసీఆర్ జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడతాయన్నారు.