News September 25, 2024
కడియంలో చిరుత.. వారికి సెలవు
కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత అడుగు జాడలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా నేడు నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘ సభ్యులు సెలవు ప్రకటించారు. ఆలమూరు మండలం గోదావరి తీరం వైపు చిరుత వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.
Similar News
News October 11, 2024
తుని: చెరువులో మద్యం సీసాలు.. ఎగబడిన మద్యం ప్రియులు
తుని మండలం రాపాక శివారు చెరువులో 10 నుంచి 15 మూటల్లో మద్యం సీసాలు ఉండటంతో గురువారం స్థానికులు వాటి కోసం ఎగబడ్డారు. చెరువులో మద్యం ప్రియులు సీసాలను గంటల వ్యవధిలోనే తీసుకుపోయారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేపట్టారు. 2 రోజుల క్రితం కేఒ మల్లవరంలో మద్యం కేసులో నలుగురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారు భయపడి మద్యం సీసాలు చెరువులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
News October 10, 2024
చింతూరు: జనజీవన స్రవంతిలో కలిసిన ఇద్దరు మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇరువురు మావోయిస్టు దళ సభ్యులు ASP పంకజ్ కుమార్ మీనా ఎదుట గురువారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముచ్చిక అయిత, మడకం హింగే ఉన్నారని అధికారులు ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. లొంగిపోయిన వారిని పోలీస్ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. మావోయిస్టులు ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి ప్రభుత్వం తరుపు నుంచి అన్ని రాయితీలు కల్పిస్తామని ASP అన్నారు.
News October 10, 2024
రాజమహేంద్రవరం: దసరాకు ప్రత్యేక రైళ్లు
దసరా సందర్భంగా గురువారం నుంచి 18వ తేదీ వరకు విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. 07215 నంబరు గల రైలు విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఈ నెల 10, 11, 12, 13, 14, 15, 16, 17 తేదీలలో, 07216 నంబర్ గల శ్రీకాకుళం-విజయవాడ మధ్య 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో నడుపుతున్నామని తెలిపారు. ఈ రైళ్లు రాజమహేంద్రవరం మీదుగా తిరుగుతాయన్నారు.