News January 26, 2025

కడియం: నర్సరీ మొక్కలతో జాతీయ జెండా 

image

76వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపుతూ కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలు కూర్పుతో రిపబ్లిక్ డే సందేశాన్ని శనివారం రైతులు ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా, ఎర్రకోట, ఆకృతులతో, రిపబ్లిక్ డే అక్షరమాలికను నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, వినయ్‌లు సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడుతూ 76 వవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆకృతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News February 14, 2025

మంత్రి వాసంశెట్టి ప్రేమ కథ

image

అమలాపురంలోని సీతారాముల ఆయల సన్నిధిలో మంత్రి వాసంశెట్టి ప్రేమ కథకు బీజం పడింది. రాములోరి కళ్యాణం జరుగుతుండగా లక్ష్మీసునీతను చూసిన ఆయన ఆమెతో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నారు. తొలిచూపులోనే ఆమెపై మనసుపడ్డారు. ఈ విషయాన్ని ఆమెకు తెలుపగా కొన్నాళ్లకు పెద్దల ఇష్టమే తన ఇష్టమన్నారు. దీంతో ఇరు కుటుంబాలను సుభాశ్ ఒప్పించారు. 2009 APR19న ఘనంగా వివాహం జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కవలలు జన్మించారు.

News February 14, 2025

దివాన్ చెరువు: లారీ డ్రైవర్ పై దుండగులు దాడి

image

ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ చంద్రుడు దివాన్‌చెరువు పండ్లమార్కెట్‌ దాటిన తరువాత రోడ్డుపక్కన లారీని ఆపాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి డ్రైవర్‌పై దాడిచేసి రూ.7,800 నగదు, రెండుసెల్‌ ఫోన్లు లాక్కుని పారిపోయారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 14, 2025

రాజమండ్రి: సీఐడీ డీఎస్పీ అనుమానాస్పద మృతి

image

రాజమండ్రిలో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వర్తించే నాగరాజు గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజమండ్రిలోని గాంధీపురం పరిధిలోని ఓ గుడివద్ద మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూస్తే డీఎస్పీగా తెలింది. 1995 బ్యాచ్‌కి చెందినవారు. సీఐడీ విభాగంలో నాగరాజు రాజమండ్రిలో పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆస్పరి.

error: Content is protected !!