News November 27, 2024

కడియం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

image

కడియం మండలం వేమగిరి 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ బి.నాగదుర్గ ప్రసాద్ తెలిపారు. వేమగిరి గట్టుకి చెందిన కల్లా దుర్గ ఆమె మేనకోడలు పితాని రూపాదేవి స్కూటీపై డిగ్రీ పరీక్షలు రాసేందుకు రాజమండ్రి వెళ్తుండగా వేమగిరి సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి మృతిచెందగా మరో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News November 27, 2024

రాజమండ్రి: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

image

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూ.గో జిల్లా SP నర్సింహ కిషోర్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 25న రాజమండ్రికి చెందిన బి.రమేష్ SVS కోచింగ్ సెంటర్‌‌పై గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై అతను 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విశాఖ జిల్లాకు చెందిన నిందితుడు డి.నాగేశ్వరావును అదుపులోకి తీసుకున్నారు.

News November 27, 2024

రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ముగ్గురు ఆత్మహత్యాయత్నం

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రాజమండ్రి జెఎన్ రోడ్డులోని సాయి సుధా రెసిడెన్సీలో బుధవారం ఉదయం ఒక కుటుంబంలోని భార్య, భర్త, కుమారుడు ముగ్గురు కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగారు. అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News November 27, 2024

108 సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: కలెక్టర్ మహేశ్

image

వైద్యపరంగా అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్‌ను అభ్యర్థించి రవాణా, వైద్య సంరక్షణను అందించే 108 ఉచిత అత్యవసర సేవలు నిలిచిపోకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నట్లు కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన వైద్యరోగ్య శాఖ అధికారులు, 108 సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. 108 వాహన డ్రైవర్లు ధర్నాకు దిగడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.