News February 18, 2025
కడియం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. భార్య కుమారితో కలిసి కొత్తపేట మండలం మందపల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం బైకుపై తిరిగి వస్తుండగా.. ముగ్గురు యువకులు బైకుపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టారు. ప్రమాదంలో రాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
Similar News
News March 15, 2025
తూ.గో: నేటి నుంచి ఒంటిపూట బడులు

నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని డీవీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 1.15గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మిగతా పాఠశాలల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News March 14, 2025
రాజమండ్రి: శక్తి యాప్ను ప్రతి మహిళ రిజిస్టర్ చేసుకోవాలి: ఎస్పీ

ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ను ప్రతి మహిళ నిక్షిప్తం చేసుకొని ఆపద సమయంలో పోలీసులు నుంచి సహాయం పొందాలని జిల్లా ఎస్పీ టి.నరసింహ కిషోర్ తెలిపారు. శక్తి యాప్ డౌన్లోడ్, ఇన్స్టాలేషన్, ఫీచర్లపై జిల్లా టెక్నికల్ టీంతో ఆయన గురువారం సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలపై జరిగే అత్యాచారాలు, వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి వాటిని నివారించడానికి శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
News March 13, 2025
పిఠాపురం రేపటి పవన్ ప్రసంగంపై సర్వత్రా అసక్తి..!

రేపు పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన అవిర్భావ సభపై రాజకీయంగా భారీ అసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధించడం డిప్యూటీ సీఎంగా మొదటిసారి జరుగుతున్న సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పవన్ చరిష్మా పెరిగింది. దీనితో రేపు ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.