News November 27, 2024
కడియం: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
కడియం మండలం వేమగిరి 216 జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందినట్లు స్థానిక ఎస్ఐ బి.నాగదుర్గ ప్రసాద్ తెలిపారు. వేమగిరి గట్టుకి చెందిన కల్లా దుర్గ ఆమె మేనకోడలు పితాని రూపాదేవి స్కూటీపై డిగ్రీ పరీక్షలు రాసేందుకు రాజమండ్రి వెళ్తుండగా వేమగిరి సెంటర్ వద్ద ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపాదేవి మృతిచెందగా మరో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News December 14, 2024
కాకినాడ సిపోర్టు వద్ద మరో చెక్పోస్ట్ ఏర్పాటు
పేదల ఆహార భద్రత కోసం నిర్దేశించిన పీడీఎఫ్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యలలో భాగంగా కాకినాడ జిల్లాలో మరో చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసిన్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్ వద్ద మరో చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాకినాడ సిపోర్టు వద్ద లారీల రద్దీ ఎక్కువ ఉండకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు.
News December 13, 2024
తూ.గో: ఆకట్టుకుంటున్న పసుపు రంగు సీతాఫలాలు
కడియం నర్సరీలలో పసుపు రంగు సీతాఫలాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కడియంకు చెందిన నర్సరీ రైతు దుర్గారావు మూడేళ్ల క్రిందట థాయిలాండ్ నుంచి మొక్కను తెచ్చి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా పెంచి పోషించారు. రైతు దుర్గారావు మాట్లాడుతూ..ప్రస్తుతం మొక్క ఇప్పటికి పెద్దదై పూత పూసిందని సంవత్సరానికి రెండుసార్లు దిగుబడిని ఇస్తుందని, లోపల గుజ్జు ఎంతో రుచిగా ఉంటుందన్నారు. దీనితో పండ్ల ప్రేమికులు సందర్శిస్తున్నారు.
News December 13, 2024
రాజమండ్రి: హోంగార్డుతో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
బొమ్మూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని గురువారం సస్పెండ్ చేశారు. SP నరసింహ కిషోర్ ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకున్నారు. మద్యం మత్తులో హెచ్‌సీ విధి నిర్వహణలో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.