News December 18, 2024

కడియం: హత్య కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు శిక్ష

image

కడియం మండలం వేమగిరిలో 2002లో వెంకన్నపై కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి సత్తిబాబుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.15 వేలు జరిమానా విధించారని కడియం ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ముద్దాయి భార్య భవాని వేమగిరి తోటకు చెందిన వెంకన్నతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన సత్తిబాబు కత్తితో వారిపై దాడి చేశాడన్నారు. ఈ దాడిలో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

Similar News

News January 25, 2025

నేడు రాజమండ్రి విమనాశ్రయానికి టెక్నికల్ టీం రాక

image

రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో శుక్రవారం మిషనరీ పనులు నిర్వహిస్తుండగా క్రేన్ ద్వారా అమరుస్తున్న పిల్లర్ సెట్టింగ్ జారిపడి విషయం విధితమే. ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అంచనాలు వేసేందుకు చెన్నై, హైదరాబాద్ టెక్నికల్ టీమ్స్ శనివారం వస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.

News January 24, 2025

రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం

image

రాజమండ్రి ఎయిర్‌‌పోర్ట్‌లో శుక్రవారం ప్రమాదం జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. స్థానికంగా కొత్త టెర్మినల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో క్రేన్ వైర్ తెగిపడటంతో నిర్మాణంలో ఉన్న కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News January 24, 2025

అయినవిల్లి: యువతి కిడ్నాప్.. కేసు నమోదు 

image

అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన పదహారేళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన దింపు కార్మికుడు సాయి బుధవారం రాత్రి తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దింపులు తీసేందుకు వచ్చిన సాయి స్థానికంగా ఉంటూ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.