News February 7, 2025
కడెం: ఉరేసుకొని వ్యక్తి మృతి

వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. కడెం ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్ పేట్ గ్రామానికి చెందిన కటికనపెల్లి నాగన్న (49) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Similar News
News February 27, 2026
జమ్మికుంట మార్కెట్‌లో స్థిరంగా పత్తి ధరలు..!

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈ వారం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. గత కొన్ని రోజులుగా పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.7,550 నుండి రూ.7,600 మధ్యనే ఊగిసిలాడింది. శుక్రవారం మార్కెట్‌కు 28 వాహనాల్లో 226 క్వింటాళ్ల విడి పత్తి రాగా గరిష్టంగా రూ.7,550 పలికింది. పత్తి నాణ్యత బాగున్నప్పటికీ మార్కెట్‌లో డిమాండ్ సాధారణంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
News February 27, 2026
KNR: రుచుల విందు.. ‘ఫ్లేవర్ ఫియస్టా’ పొందు!

SRR కళాశాలలో జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ఫ్లేవర్ ఫియస్టా పేరుతో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుతాయని కొనియాడారు. కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, అధ్యాపకులు రాజయ్య, నితిన్, కిరణ్మయి, మహేష్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
News February 27, 2026
నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు: బొత్స

తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఆరోగ్యంగానే ఉన్నానని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని వైసీపీ ట్వీట్ చేసింది. బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్ సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా తన ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, రొటీన్ చెకప్‌లో భాగంగా మాత్రమే ఆస్పత్రికి వచ్చానని ఆయన స్పష్టం చేశారు.


