News January 31, 2025
కడెం: కేంద్ర టెలికాం సలహా కమిటీ సభ్యుడిగా రమేశ్

ADB పార్లమెంట్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ టెలి కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ బీఎస్ఎన్ఎల్ సలహ కమిటి సభ్యుడిగా మండలంలోని మాసాయిపేట గ్రామానికి చెందిన బుర్ర రమేశ్ గౌడ్ నియామకమయ్యారు. గురువారం ఎంపీ గోడం నగేశ్ నియామకపత్రాన్ని ఆయనకు అందజేశారు. నియామకానికి కృషి చేసిన ఎంపీ నగేశ్కి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 16, 2025
MNCL: రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలి: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలోని రైతులు లబ్ధి పొందేలా పంట సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే యాసంగి కాలంలో లబ్ధి పొందే విధంగా రైతులు పంట సాగు చేయాలని, ఆ దిశగా అధికారులు రైతులకు అవసరమైన మెలకువలు, సలహాలు అందించాలని సూచించారు.
News November 16, 2025
జాతీయవాదం వల్లే యుద్ధాలు: మోహన్ భాగవత్

ప్రపంచ సమస్యలకు సమాధానాలు అందించే తెలివి, ఆలోచన ఇండియాకు ఉన్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ‘జాతీయవాదం కారణంగానే యుద్ధాలు జరుగుతాయి. అందుకే ప్రపంచ నేతలు అంతర్జాతీయవాదం గురించి మాట్లాడటం ప్రారంభించారు. కానీ తమ దేశ ప్రయోజనాలనే ప్రధానంగా చూసుకుంటారు’ అని చెప్పారు. జైపూర్లో నిర్వహించిన దీన్ దయాళ్ స్మృతి ఉపన్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
News November 16, 2025
19న పుట్టపర్తికి ప్రధాని మోదీ రాక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 9:50కి విమానాశ్రయం చేరుకుని, 10 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధిని దర్శించుకుంటారు. 10:20కి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే సత్యసాయి జయంతోత్సవాలలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30కి కోయంబత్తూర్కు బయలుదేరనున్నట్లు పీఎంవో తెలిపింది.


