News March 15, 2025
కడెం: గ్రూప్-3 ఫలితాల్లో మెరిసిన తండా యువకుడు

గ్రూప్-3 ఫలితాల్లో కడెం మండలంలోని చిన్న బెల్లాల్ తండాకు చెందిన భుక్యా శశికుమార్ ప్రతిభ కనబరిచాడు. 306 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో రాష్ట్రస్థాయి ఫస్ట్ ర్యాంక్, జనరల్ కోటాలో 58వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యమున-కిషన్ దంపతుల కుమారుడు శశికుమార్ గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. గ్రూప్-3లో ప్రతిభ కనబరిచిన శశి కుమార్ను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News November 25, 2025
జనగామ: డబుల్ బెడ్ రూంల పరిస్థితి ఏంటి.?

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో వాటిని పంచకపోవడం, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో కొన్ని గ్రామాల్లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పేద కుటుంబాలకు వాటిని పంచి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 25, 2025
ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.
News November 25, 2025
విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్

విశాఖకు పర్యాటక రంగంలో తలమానికంగా కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని నగర ప్రజలతో పాటు పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 30 లేదా డిసెంబర్ 1న అధికారికంగా దీనిని ప్రారంభించనున్నారు. విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని సమాచారం.


