News February 22, 2025
కడెం: దివ్యాంగులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర పరిధిలో దివ్యాంగులకు కంప్యూటర్ కోర్సుల్లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నామని తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సట్టి సాయన్న తెలిపారు. దూరప్రాంతాల వారికి ఉచితంగా హాస్టల్ వసతి కూడా కల్పిస్తారన్నారు. ఈ శిక్షణకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 8885512035 సంప్రదించాలని కోరారు.
Similar News
News January 11, 2026
WGL: ఆ మెసేజ్ నమ్మొద్దు.. అది ఆకతాయిల పనే!

జిల్లాలో ‘4 కిడ్నీలు సిద్ధంగా ఉన్నాయి’ అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న సందేశం పూర్తిగా అవాస్తవమని తేలింది. ఈ మెసేజ్‌పై అనుమానం వచ్చి అందులోని నంబర్‌ను సంప్రదించగా, అది ఒక యువతికి చెందినదిగా వెల్లడైంది. ఎవరో ఆకతాయిలు కావాలనే తన నంబర్‌తో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనివల్ల తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేశారు.
News January 11, 2026
సంక్రాంతి: సిరి సంపదల కోసం ఆరోజు ఏం చేయాలంటే?

సంక్రాంతినాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడిని ఆరాధించాలి. హరిదాసులు, గంగిరెద్దులను సత్కరిస్తే వల్ల విష్ణుమూర్తి, నందీశ్వరుల కృప లభిస్తుంది. నువ్వుల నీటితో శివాభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయని, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేదలకు వస్త్రాలు, అన్నదానం చేయడం, గోపూజ నిర్వహించడం వల్ల పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుంది.
News January 11, 2026
నేడు సీఎం చంద్రబాబుతో జంగా భేటీ

సీఎం చంద్రబాబుతో నేడు జంగా కృష్ణమూర్తి భేటీ కానున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ పదవికి జంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చర్చించేందుకు సీఎంఓ నుంచి జంగాకు పిలుపు వచ్చింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కలిసి జంగా ఈరోజు సీఎంను కలవనున్నట్లు జంగా సన్నిహితులు తెలిపారు. సీఎంతో చర్చల అనంతరం జంగా నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.


