News February 9, 2025
కడెం: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి మనస్థాపం చెంది పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది.ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ..లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెందాడు. దీంతో ఈనెల 7న పురుగుల మందు సేవించాడు.ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News November 17, 2025
రేపు కర్నూలులో ట్రైలర్ రిలీజ్

హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు అభిమానుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రేపు కర్నూలులో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నగరంలో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ ఫ్యాన్స్ మధ్య ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. 27న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.
News November 17, 2025
అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు(1/2)

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.
News November 17, 2025
iBOMMA రవి భార్య వల్ల దొరికిపోయాడా? క్లారిటీ ఇదే!

iBOMMA నిర్వాహకుడు రవి భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులయ్యాయి. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్లోని విస్టా అపార్ట్మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.


