News July 21, 2024
కడెం ప్రాజెక్టు అప్డేట్.. 10 వేల క్యూసెక్కుల నీటి విడుదల
కడెం ప్రాజెక్టు ద్వారా దిగువకు 10 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి ఆదివారం రాత్రి 10 గంటలకు 6,941 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టులోని రెండు గేట్ల ద్వారా కుడి, ఎడమ కాలువలతో పాటు దిగువ గోదావరిలోకి మొత్తం 10,545 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గడంతో కడెం ప్రాజెక్టులోకి వచ్చే వరద నీరు తగ్గింది.
Similar News
News October 11, 2024
ADB: అమ్మవారి రూపంలో హారతి
ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదర్శ్ దుర్గాదేవి మండలి వద్ద గురువారం రాత్రి దుర్గాదేవికి కాలనీవాసులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజల అనంతరం పూజారి హారతి ఇవ్వగా దుర్గమ్మ రూపంలో కనిపించిందంటూ భక్తులు చర్చించుకున్నారు. అదే సమయంలో హారతిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
News October 11, 2024
ఆదిలాబాద్: ఉపకార వేతనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
2024- 25 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ-పాస్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హుడైన విద్యార్థి పేరు SSC మెమోలో ఉన్న విధంగా ఆధార్ కార్డులో ఉండాలన్నారు. విద్యార్థుల ఆదాయపరిమితి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెంచామని చెప్పారు.
News October 11, 2024
ADB: దమ్మ పరివర్తన దివస్ సందర్భంగా ఆమ్లాకు ప్రత్యేక రైలు
దమ్మ పరివర్తన దినోత్సవం నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో నాందేడ్- ఆమ్లా- నాందేడ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రత్యేక రైలు (నం.07025) నాందేడ్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతుందని, అదేవిధంగా శనివారం ప్రత్యేక రైలు (నం. 07026) ఆమ్లా నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ రైళ్లు ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో సైతం ఆగుతాయని తెలిపారు.