News August 30, 2024
కడెం ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఈ
కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్ తెలిపారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముందని శుక్రవారం రాత్రి వరద గేట్ల నుంచి దిగువకు నీటిని వదిలే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో
నది పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.
Similar News
News September 9, 2024
బాసర: అర్జీయూకేటీ విద్యార్థుల చర్చలు సఫలం
బాసర అర్జీయూకేటి వీసీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసోసియేట్ డీన్లు సోమవారం విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వంలోని అవసరమైన ఏజెన్సీలతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News September 9, 2024
సీఎంను కలిసిన ADB ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని, ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన అదిలాబాద్ జిల్లా రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పెన్ గంగ నది పరివాహక ప్రాంతంలో వరదలు పోటెత్తి పత్తి, సోయాబీన్, కంది పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని పేర్కొన్నారు.
News September 9, 2024
అసౌకర్యాలకు నిలయంగా కుంటాల జలపాతం
నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు వేదన అనుభవిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి గదులు లేవు. మెట్ల మార్గంలో కనీసం సేద తీరే పరిస్థితి లేదు. మార్గమధ్యలో వర్షం కురిస్తే పూర్తిగా తడిసి పోవాల్సిందే. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలపాతం వద్ద మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.