News August 13, 2024

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

image

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 698. 075 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 1419 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు.

Similar News

News November 21, 2025

ADB: రైతులందరికీ జోగురామన్న కృతజ్ఞతలు

image

ఆదిలాబాద్ జిల్లా రైతులందరికీ మాజీ మంత్రి జోగు రామన్న కృతజ్ఞతలు తెలిపారు. ఆఖిలపక్ష రైతు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేస్తూ రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడటానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

News November 21, 2025

BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

image

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

News November 21, 2025

ADB: డిసెంబర్‌లో TCA రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

image

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు TCA రాష్ట్ర సభ్యురాలు, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ చిట్యాల సుహాసిని తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ స్థాయిలో తరువాత రాష్ట్ర స్థాయిలో ఉంటాయని వివరించారు. అండర్ 23తో పాటు 23ఏళ్ల వారికి నలుగురు క్రీడాకారులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆమెతో పాటు జోనల్ ఇన్‌ఛార్జ్ నరోత్తమ్ రెడ్డి ఉన్నారు.