News September 14, 2024
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలు

కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699.950 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 966 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైటు కెనాల్‌ల ద్వారా 870, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 9, 2025
ADB: పోలీసుల విధులకు ఆటంకం కలిగించి 9 మందిపై కేసు

గత నెల 27న నేరేడుగొండలో రోడ్డుపై బైఠాయించి పోలీసు విధులకు ఆటంకం కలిగించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, నలుగురిని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పోలీసు విధులను ఆటంకపరిచేలా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News July 8, 2025
ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.
News July 8, 2025
ADB: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్ రాజర్షి షా

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. వికలాంగుల ఆర్థిక పునరావాసం కోసం ఎంపిక చేసిన దివ్యాంగ లబ్ధిదారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన ఉత్తర్వుల కాపీలను ఇచ్చారు. 15 మంది దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో రూ.7.50 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ మిల్కా తదితరులు పాల్గొన్నారు.