News July 29, 2024
కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

కడెం ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి సుమారు 8,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం 695 అడుగులకు నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 699 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాలువలకు 379, మిషన్ భగీరథ 9, దిగువకు 8178 మొత్తం కలిపి 8634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.
Similar News
News October 20, 2025
ADB: బీసీ విద్యార్థులకు శుభవార్త..!

బీసీ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించారు. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. గత గడువు 15తో ముగియగా.. పొడిగించినట్లు పేర్కొన్నారు.
News October 20, 2025
ADB: గుస్సాడీ వేషధారణలో అదరగొట్టిన బాలుడు

భీంపూర్ మండలంలోని వాడేగామ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలుడు కాత్లే ఉమేష్ ఆదివాసీల గుస్సాడీ వేషధారణలో అదరగొట్టాడు. ఎంత ఆధునికత వచ్చినా, సంస్కృతిని కాపాడుకోవడంలో ఆదివాసీలు ముందున్నారని, ఈ బాలుడి రూపంలో వారసత్వం తరాలుగా ప్రవహిస్తోందని స్థానికులు కొనియాడారు. ఈ గుస్సాడీ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది.
News October 19, 2025
ఇంద్రవెల్లి: దండారీ ఉత్సవాలు పాల్గొన్న ADB ఎస్పీ

ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్పెన్కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశారు. అదివారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారీ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ప్రసాద్ హాజరయ్యారు. గుస్సాడీలతో కలసి కోలాటం ఆడుకున్నారు.