News October 26, 2024

కడెం ప్రాజెక్టు వద్ద గొర్రెను హతమార్చిన కొండచిలువ

image

కడెం ప్రాజెక్టు వద్ద కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పెద్దూరు గ్రామానికి చెందిన గోపు మల్లేశ్ అనే వ్యక్తి గొర్రెల మందను మేతకి కడెం ప్రాజెక్టు కింది వైపు వెళ్లాడు. ఈక్రమంలో పక్కనే ఉన్న కాలువ ఒడ్డు నుంచి కొండచిలువ గొర్రెపై దాడి చేసి హతమార్చింది. అక్కడికి చేరుకున్న కాపరి కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. ఓ వ్యక్తి బండరాయి విసరడంతో కొండచిలువ నీళ్లలోకి పారిపోయింది.

Similar News

News November 2, 2024

సిరికొండ: బావిలో పడి పదేళ్ల బాలుడి మృతి

image

సిరికొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అనంతపూర్‌కు చెందిన తోడసం నాగు- ఇస్రుబాయి దంపతుల కుమారుడు లాల్ సావ్ (10) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. శనివారం ఉదయం స్థానికులు గ్రామ పొలిమేరలో గాలించగా బావిలో బాలుడు శవమై కనిపించాడు. దీంతో వారు బాలుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 2, 2024

ADB: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

ఓ బాలిక (17)ను ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని మోసం చేసిన కేసులో నిందితుడి పై మావల పీఎస్‌లో అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఇర్ఫాన్ పై అట్రాసిటీ, పోక్సో కేసును నమోదు చేశామన్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

News November 2, 2024

కుంటాల: చిరుత దాడిలో ఆవు మృతి

image

కుంటాల మండలం సూర్యపూర్ శివారు ప్రాంతంలో చిరుత దాడిలో ఓ ఆవు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం రైతు సాయన్నకు చెందిన ఆవు గ్రామ శివారులోని అడవిలో మేత మేస్తుండగా చిరుతపులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత రైతు మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.