News September 30, 2024
కడెం ప్రాజెక్టు UPDATE

ఎగువ నుంచి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 902 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కుడి, ఎడమ కాల్వలకు 806, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 902 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్ట్ అధికారులు వివరించారు.
Similar News
News December 9, 2025
ADB: ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమలులోకి వస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వస్తాయన్నారు.
News December 9, 2025
ఆదిలాబాద్: “నేను మీ అభ్యర్థినే.. నాకెందుకు చేయరు ప్రచారం..”

ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సొంత పార్టీ నుంచి రెబల్గా పోటీలో ఉన్నవారు వారిని ఇరకాటంలో పెడుతున్నారు. “మేము కూడా మీ పార్టీనే. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మీరు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. మాకు కూడా ప్రచారం చేయండి” అని అడగడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.
News December 9, 2025
గర్భిణులకు ఎంసీపీ కార్డులేవు.. తాత్కాలికంగా జిరాక్స్ కార్డులు అందజేత

మాతా శిశు మరణాలను సున్న శాతానికి చేర్చడమే లక్ష్యమని వైద్య శాఖ ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు కానీ కనీసం గర్భిణులకు వివరాలను నమోదు చేసే కార్డులను సమకూర్చలేని దుస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. గర్భిణులు సొంత ఖర్చుతోనే పాత వాటిని జిరాక్స్ తీస్తున్నారు. నార్నూర్, గాదిగూడ పీహెచ్‌సీలో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గర్భిణులకు ఎంసీపీ కార్డులు అందజేయాలని కోరుతున్నారు.


