News March 24, 2024

కడెం: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి…!

image

కడెం మండలం పెద్దూర్ గ్రామ సమీపంలోని గిరిజన వసతిగృహం సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దూరుకు చెందిన కత్తె రాపాక గంగన్న(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మరణించినట్లు బంధువుల తెలిపారు. సైకిల్ పై కడెం నుంచి పెద్దూరుకు వెళ్తున్న గంగన్నను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహన చోదకుడికి గాయాలైనట్లు సమాచారం.

Similar News

News September 17, 2024

SKZR: నవోదయ దరఖాస్తు గడువు పెంపు

image

కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పెంచినట్ల ప్రిన్సిపల్ కొడాలి పార్వతి తెలిపారు. ఈ నెల 16తో గడువు ముగియగా విద్యాలయ సమితి తిరిగి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 17, 2024

కాగజ్‌నగర్: లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూను వేలం పాటలో ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన అప్జల్- ముస్కాన్ దంపతులు రూ.13,216లకు వినాయకుని లడ్డూను వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు.

News September 16, 2024

రేపు ADBలో మద్యం దుకాణాలు మూసివేత

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 17న మంగళవారం మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. పట్టణంలో మంగళవారం వినాయక నిమజ్జనం శోభాయాత్రను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం వ్యాపారులు ఎవరైనా ఈ సమయాల్లో విక్రయాలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరిగి బుధవారం యథావిధిగా దుకాణాలు తెరుస్తారని పేర్కొన్నారు.