News January 26, 2025
కడ్తాల్ గ్రామస్థుల సమస్యలు తీరుస్తాం: నిర్మల్ కలెక్టర్

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సోన్ మండలం కడ్తాల్ గ్రామ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కొన్ని రోజులుగా గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డితో కలిసి కడ్తాల్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థులు ఆందోళన చెందవద్దని, తప్పకుండా వారి సమస్యలను తీరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
Similar News
News November 24, 2025
ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం

ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సొంతిల్లు కట్టుకోవాలనుకున్న పేదలకు పెరిగిన ఇసుక, ఇటుక ధరలు గుదిబండగా మారాయి. ఖమ్మం జిల్లాలో ఇసుక రూ.8 వేల నుంచి రూ.12 వేలు, ఇటుక రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తుండటంతో నిర్మాణం భారమైంది. ‘దేవుడు కరుణించినా, వ్యాపారులు కరుణించలేదు’అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
మండపేటలో మంత్రి పర్యటన రద్దు

మంత్రి నాదెండ్ల మనోహర్ మండపేట పర్యటన రద్దయిందని ఏపీ ఐఐసీ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తెలిపారు. మంత్రి మంగళవారం మండపేటలో సూర్య కన్వెన్షన్ హాల్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల కార్యక్రమం రద్దు చేశారు. మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో చెప్తామన్నారు.
News November 24, 2025
రబీ రాగుల సాగు- మధ్యకాలిక, స్వల్ప కాలిక రకాలు

☛ సప్తగిరి: ఇది మధ్యకాలిక రకం. పంట కాలం 100-105 రోజులు. ముద్దకంకి కలిగి, అగ్గి తెగులును తట్టుకొని 12-15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ☛ వకుళ: పంట కాలం 105-110 రోజులు. దిగుబడి- ఎకరాకు 13-15 క్వింటాళ్లు. ☛ హిమ- తెల్ల గింజ రాగి రకం. పంటకాలం 105-110 రోజులు. దిగుబడి: 10-12 క్వింటాళ్లు. ☛ మారుతి: స్వల్పకాలిక రకం. పంట కాలం 85-90 రోజులు. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడిస్తుంది. అంతర పంటగా వేసుకోవచ్చు.


