News February 6, 2025

కడ్తాల్ సమస్యను పరిష్కరించాలి: నిర్మల్ కలెక్టర్

image

సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి ‘వై’ జంక్షన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామస్థులు పడుతున్న ఇబ్బందిని గుర్తించి గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులు, కడ్తాల్ గ్రామస్థులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Similar News

News January 7, 2026

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.12,000 పెరిగి రూ.2,83,000కు చేరింది. మూడు రోజుల్లోనే రూ.26వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.660 పెరిగి రూ.1,39,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,27,850 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 7, 2026

నల్గొండ: రూ.10వేల నుంచి రూ.40కోట్లకు!

image

నల్గొండ మున్సిపాలిటీ అరుదైన మైలురాయిని చేరుకుంది. 74 ఏళ్ల క్రితం కేవలం రూ.10 వేల వార్షిక బడ్జెట్‌తో ప్రారంభమైన ఈ మున్సిపాలిటీ ఆదాయం, నేడు రూ. 40 కోట్లకు పైగా పెరిగింది. వలసలు పెరగడంతో పట్టణ జనాభా ప్రస్తుతం 2.5 లక్షలు దాటింది. జనాభాకు అనుగుణంగా పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు చిన్న ఆదాయ వనరుగా ఉన్న మున్సిపాలిటీ, నేడు కోట్ల ఆదాయంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.

News January 7, 2026

నిర్మల్: మున్సిపాలిటీలపై బీజేపీ గురి!

image

వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సంకేతాలు వెలువుడుతుండడంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. కాంగ్రెస్, BRS, ఎంఐఎం పార్టీల కంటే BJP ఓ అడుగు ముందుకు వేసి కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్ పదవులను దక్కించుకొని ఛైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికల్లో అదే ఊపు కొనసాగింది.