News April 19, 2024

కణేకల్లు మండలంలో చంద్రబాబు సభ

image

అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం అనంతపురం జిల్లా కణేకల్లుకు రానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఆలూరు అగ్రహారం కొండవద్ద హెలికాఫ్టర్లో బయలుదేరి 5.10 గంటలకు కణేకల్లు క్రాస్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 5.15 గంటలకు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 5.25 గంటలకు కణేకల్లు బస్టాండ్ సెంటర్ కు చేరుకుంటారు. 6.00-7.30 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.

Similar News

News February 27, 2026

అనంత: వైద్యశాఖలపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ICDS, మెడికల్ అండ్ హెల్త్ శాఖల పనితీరుపై చర్చించారు. ICDS PD, DMHO, CDPOలు, సూపర్‌వైజర్లు, వైద్యాధికారులు హాజరయ్యారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలను మెరుగుపరచాలని సూచించారు. పోషణ, టీకాలు, ఆరోగ్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News February 27, 2026

ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ: కలెక్టర్

image

మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో ఫిబ్రవరి 28న ఎన్‌టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ అందజేస్తారన్నారు. ఫిబ్రవరి నెలకు జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. మొదటి రోజు పొందని వారు మార్చి 2న పింఛన్ పొందవచ్చన్నారు.