News July 4, 2024

కత్తిపూడి జాతీయ రహదారిపై ప్రమాదం.. మహిళ మృతి

image

కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ(62) అక్కడికక్కడే మృతి చెందింది. కత్తిపూడి నుంచి రావికంపాడు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అథారిటీ గాయాలైన భర్తను అంబులెన్సులో తుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News December 11, 2025

రాజమండ్రి: ‘యూరియా కొరత లేదు’

image

జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7599.34 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీసీఎంఎస్‌లో 257.36, పీఏసీఎస్‌లో 2530.03, ఆర్ఎస్కేల్లో 114.53, ప్రైవేట్ డీలర్ల వద్ద 1993.10, మార్క్ఫెడ్ వద్ద 2604.20, హోల్సేల్ ప్రైవేట్ డీలర్ల వద్ద 100.14 మెట్టు టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.

News December 11, 2025

కందుల దుర్గేశ్‌కు 7వ ర్యాంకు

image

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాలనలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించి సీఎం ప్రశంసలు పొందారు. జనసేన కోటాలో మంత్రి అయిన దుర్గేశ్.. 316 ఫైళ్లను కేవలం 3 రోజుల 9 గంటల 21 నిమిషాల సమయంలోనే క్లియర్ చేసి సత్తా చాటారు. కాగా ఫైళ్ల పరిష్కారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

News December 11, 2025

తూ.గో. కలెక్టర్‌కు 13వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి IAS 711 ఫైళ్లు స్వీకరించి, 680 ఫైళ్లను పరిష్కరించారు. ఆమె సగటు ప్రతిస్పందన సమయం 1 రోజు 21 గంటల 12 నిమిషాలుగా ఉంది. ఈమె పనితీరు ఆధారంగా ఆమెకు 13వ ర్యాంకు కేటాయించారు.