News December 22, 2024
కత్తులతో బెదిరించి చోరీకి యత్నం
శ్రీకాకుళం కిన్నెర కాంప్లెక్స్ వద్ద కాకి వీధిలోని గోవింద్ ఇంటిలో శనివారం రాత్రి దొంగలు కత్తులతో హల్చల్ చేశారు. ఇంట్లోని బాలుడు, ఓ మహిళ కూరగాయల కత్తితో ప్రతిఘటించారు. దీంతో దొంగలు పారిపోయేందుకు యత్నించగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇంటి సభ్యుల కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. DSP వివేకానంద, సీఐ పైడిపు నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 26, 2025
శ్రీకాకుళంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు
శ్రీకాకుళంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాకావిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ప్రజలనుద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు.
News January 26, 2025
జెండాను ఆవిష్కరించిన.. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కలెక్టరేట్ ఆవరణంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఏ.వో. సూర్యనారాయణ, సెక్షన్ సూపరింటెండ్‌లు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 26, 2025
బొబ్బిలిపేటలో వ్యక్తి దారుణ హత్య
ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన గురుగుబెల్లి చంద్రయ్య (47)ను శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పొలిమేరలో వద్ద హత్య చేశారు. హత్యకు గురైన చంద్రయ్య వైసీపీ కార్యకర్తగా గ్రామంలో కొనసాగుతున్నారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.